China-Srilanka-Ariport: చైనాకు షాకిచ్చిన శ్రీలంక...భారత్, రష్యాలకు డ్రాగన్ నిర్మించిన ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు
చైనా (China) దేశానికి శ్రీలంక (SriLanka)గట్టి ఝలక్కించింది. శ్రీలంకలో చైనా దేశం 2009 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఎయిర్ పోర్ట్ (Airport) నిర్వహణ బాధ్యతల్ని భారత్, రష్యా కంపెనీలకు అప్పగించాలని శ్రీలంక నిర్ణయించింది. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానించింది. శ్రీలంకలోని హంబన్ టోటా (Hmuban Tota)తీరానికి సమీపంలో ఈ విమానాశ్రయం ఉంది. హంబన్ టోటా ఓడరేవును శ్రీలంక ప్రభుత్వం 99 సంవత్సరాలకు చైనాకు లీజుకి ఇచ్చింది. ఈ నౌకాశ్రయానికి సమీపంలోని ఎయిర్పోర్ట్ నిర్వహణను భారత్ కు చెందిన ఒక కంపెనీ దక్కించుకోవడం విశేషం. మట్టాల రాజపక్ష అంతర్జాతీయ విమానాశ్రయం ను చైనా 2013 వ సంవత్సరంలో నిర్మించింది.
అధిక వడ్డీ రేట్ల తో శ్రీలంకకు చిక్కులు...
ఈ విమానాశ్రయం నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జామ్ బ్యాంక్ (Exim Bank)రుణ సహాయాన్ని అందజేసింది . ఈ విమానాశ్రయం నిర్మాణం మొదలు శ్రీలంక ప్రభుత్వానికి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ విమానాశ్రయం ఇక్కడ నిర్మించడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఈ విమానాశ్రయానని ఇక్కడ నిర్మించడం వల్ల శ్రీలంక ప్రభుత్వం భారీ నష్టాలను చవిచూసింది. చైనా ఇచ్చిన రుణాలపై అధిక వడ్డీ చెల్లించడం శ్రీలంకకు కష్టతరమైంది. ఫలితంగా శ్రీలంక ఆర్థిక బడ్జెట్ లోటు పెరుగుతూ వచ్చింది. దీంతో ఎగ్జామ్ బ్యాంక్ నుంచి తీసుకున్న ఆర్థిక రుణాన్ని పునర్వ్యవస్థీకరించాలని శ్రీలంక ప్రభుత్వం చైనాను కోరింది.
ఇంకా ఎంఓయూను వెల్లడి చేయని శ్రీలంక
ఈ కారణంగానే ఈ విమానాశ్రయ నిర్వహణను శ్రీలంక ప్రభుత్వం భారత్ కు చెందిన శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు రష్యా కు చెందిన రీజియన్స్ మేనేజ్మెంట్ కంపెనీకి 30 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. అయితే ఈ ఒప్పంద పత్రాలపై మూడు దేశాలు సంతకాలు చేసినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.