LOADING...
Electric scooter : సిటీ రైడింగ్‌కు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. తక్కువ ధరతో 110 కి.మీ రేంజ్
సిటీ రైడింగ్‌కు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. తక్కువ ధరతో 110 కి.మీ రేంజ్

Electric scooter : సిటీ రైడింగ్‌కు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. తక్కువ ధరతో 110 కి.మీ రేంజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారీకే పరిమితమైన ఓమెగా సైకి మొబిలిటీ (ఓఎస్‌ఎం) ఇప్పుడు సామాన్యుల రోజువారీ ప్రయాణ అవసరాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కంపెనీ తన తొలి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ 'ఓఎస్‌ఎం వెక్స్‌ట్రా'ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధరను రూ. 99,900గా నిర్ణయించింది.

Details

నగర ప్రయాణాల కోసం ప్రత్యేక డిజైన్

పట్టణాల్లో నిత్యం ప్రయాణించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఓఎస్‌ఎం వెక్స్‌ట్రాను రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఛార్జింగ్ సౌకర్యం ఇంట్లో ఉపయోగించే సాధారణ ఛార్జర్‌తోనే ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయవచ్చు. 0 నుంచి 80 శాతం బ్యాటరీ నిండడానికి సుమారు 4 గంటల సమయం పడుతుండగా, పూర్తి ఛార్జింగ్‌కు దాదాపు 5 గంటలు అవసరం అవుతుంది.

Details

స్మార్ట్ ఫీచర్లు - ఆధునిక డ్రైవింగ్ అనుభవం

రైడర్ల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓఎస్‌ఎం వెక్స్‌ట్రాలో పలు స్మార్ట్ ఫీచర్లను అందించారు. బ్యాటరీ ఛార్జ్ స్థాయి, స్పీడ్, మిగిలిన ప్రయాణ దూరాన్ని చూపించే 3.5 ఇంచ్ కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇందులో ఉంది. అవసరాన్ని బట్టి ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్లలో డ్రైవ్ చేసే అవకాశం కల్పించారు. అదనంగా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ సులభంగా చేయడానికి రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అవసరమైతే జీఎస్ఎం కనెక్టివిటీని కూడా పొందవచ్చు.

Advertisement

Details

రోడ్డు సామర్థ్యం

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 12 డిగ్రీల వరకు వాలు ఉన్న రోడ్లను కూడా సునాయాసంగా ఎక్కగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా విక్రయాలు, ఎగుమతుల ప్రణాళిక భారతదేశంలోని టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో ఉన్న 200కిపైగా డీలర్‌షిప్‌ల ద్వారా ఓఎస్‌ఎం వెక్స్‌ట్రాను విక్రయించాలని ఓమెగా సైకి మొబిలిటీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఈ వాహనాన్ని ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Details

తయారీ సామర్థ్యం, భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని తమ తయారీ ప్లాంట్‌లో ఏడాదికి 25,000 ఓఎస్‌ఎం వెక్స్‌ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిట్లను తయారు చేసే సామర్థ్యం ఉందని సంస్థ తెలిపింది. అలాగే భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఓమెగా సైకి మొబిలిటీ స్పష్టం చేసింది.

Advertisement