
Sri Lanka team: వరుస షెడ్యూల్‌తో శ్రీలంక బిజీ బిజీ.. జులైలో భారత్ పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక క్రికెట్(Sri Lanka team)కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఆ జట్టు వరుసగా అంతర్జాతీయ మ్యాచులు ఆడేందుకు సిద్ధమైంది.
2023 వన్డే వరల్డ్ కప్‌లో ప్రభుత్వ జోక్యం కారణంగా ఐసీసీ(ICC) శ్రీలంక క్రికెట్‌ను అంతర్జాతీయ మ్యాచులు ఆడకుండా నిషేధించిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవల ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో వరుస పర్యటనలో శ్రీలంక జట్టు బిజీగా మారింది.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడనుంది.
జనవరిలో జింబాబ్వేతో సిరీస్‌తో ఆ జట్టు అంతర్జాతీయ పర్యటన ప్రారంభం కానుంది.
Details
51 మ్యాచులు ఆడనున్న శ్రీలంక
శ్రీలంక జట్టు వచ్చే ఏడాది మొత్తం 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లతో సహా మొత్తం 51 మ్యాచులను ఆడనుంది.
మొదట జనవరిలో జింబాబ్వేలో పర్యటించనుండగా, తర్వాత ఆఫ్గాన్, భారత్ తో తలపడనుంది.
మరోవైపు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది.
ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటించాల్సి ఉంది. జనవరిలో ఆఫ్గనిస్తాన్‌తో, ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.