LOADING...
IND vs USA : అమెరికాపై భారత్ ఘన విజయం
అమెరికాపై భారత్ ఘన విజయం

IND vs USA : అమెరికాపై భారత్ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
10:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం నమోదు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. అమెరికా బ్యాటర్లలో మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేయగా, సంజయ్‌ కృష్ణమూర్తి 37 పరుగులు, శుభమ్‌ రంజానే అవుట్‌ కాకుండా 37 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో 2 వికెట్లు తీయగా, వరుణ్‌ చక్రవర్తి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయం ద్వారా భారత్‌ టోర్నీలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

29 పరుగుల తేడాతో భారత్ గెలుపు

Advertisement