LOADING...
T20 World Cup: వరల్డ్‌కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ ఎంట్రీ.. దద్ధరిల్లిన వాంఖడే స్టేడియం (వీడియో)
వరల్డ్‌కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ ఎంట్రీ.. దద్ధరిల్లిన వాంఖడే స్టేడియం (వీడియో)

T20 World Cup: వరల్డ్‌కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ ఎంట్రీ.. దద్ధరిల్లిన వాంఖడే స్టేడియం (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
08:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో మరోసారి క్రికెట్ ఫీవర్ మొదలైంది. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ.. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌తో మరింత ఘనంగా కొనసాగుతోంది. ఈ సందడికి నాంది పలుకుతూ ముంబైలోని వాంఖడే స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్‌ రోహిత్ శర్మ, ఐసీసీ అధ్యక్షుడు జై షా మైదానంలోకి అడుగుపెట్టారు. బ్లాక్ డ్రెస్‌, తెలుపు షూస్‌తో స్టైలిష్‌గా మెరిసిన రోహిత్ శర్మ.. వరల్డ్‌కప్ ట్రోఫీని చేతబట్టి మైదానంలోకి రావడంతో ఆ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. పదో సీజన్ టీ20 ప్రపంచకప్‌ పోటీల ప్రారంభంతో క్రీడాభిమానులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. భారత జట్టు మ్యాచ్‌కు వేదికైన వాంఖడే స్టేడియం నిండుకుండలా మారింది.

Details

రోహిత్ నినాదాలతో మార్మోమోగిన మైదానం

డ్రమ్స్ శివమణి తనదైన స్టయిల్‌లో ప్రదర్శన ఇస్తూ అభిమానులను స్టెప్పులు వేయించగా, మరోవైపు నృత్యకారులు, యువతీయువకుల బృందం లయబద్ధంగా, ఉత్సాహంగా డ్రమ్స్ మోగిస్తూ వరల్డ్‌కప్‌ జోష్‌ను మరింత పెంచారు. ఆ తర్వాత ప్రపంచకప్ అంబాసిడర్‌, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. ఐసీసీ ఛైర్మన్ జై షాతో కలిసి హిట్‌మ్యాన్ ఎంట్రీ ఇవ్వగానే.. వరల్డ్‌కప్ ట్రోఫీతో ముందుకు సాగుతున్న రోహిత్‌ను చూసి స్టేడియం అంతా "రోహిత్.. రోహిత్" నినాదాలతో మార్మోగిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement