SL Vs NZ : శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య 6 రోజుల టెస్టు.. కారణమిదే!
న్యూజిలాండ్‌తో జరిగే తమ టెస్టు సిరీస్ కోసం షెడ్యూల్ ఇప్పటికే శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ రెండు జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ సెప్టెంబర్‌లో మొదలుకానుంది. మొదటి టెస్టు సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు, రెండో టెస్టు సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు గాలేలో జరగనున్నాయి. అయితే టెస్టు మ్యాచు అయిదు రోజులు మాత్రమే జరగాలి. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఆరు రోజులు జరగడం విశేషం. గాలేలో ప్రారంభమయ్యే మొదటి టెస్టు ఆరు రోజులు సాగనుంది.
ఎన్నికల కారణంగా ఒకరోజు విశ్రాంతి
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల కారణంగా మ్యాచులో ఒకరోజు విశ్రాంతి ఇవ్వనున్నట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సందర్భంగా 21న ఆటకు విశ్రాంతి ఇవ్వనున్నారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత ఆరు రోజులు టెస్టుకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. 2001లో 'పోయాడే' (పౌర్ణమి) సందర్భంగా జింబాబ్వేతో ఆరు రోజుల టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఎన్నికల కారణంగా బంగ్లా, శ్రీలంక మధ్య ఆ ఏడాది డిసెంబర్ లో జరిగిన మ్యాచును కూడా ఆరు రోజులు నిర్వహించడం విశేషం.