LOADING...
Tamil Nadu : కింగ్‌మేకర్‌గా దళపతి విజయ్?.. తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!
కింగ్‌మేకర్‌గా దళపతి విజయ్?.. తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!

Tamil Nadu : కింగ్‌మేకర్‌గా దళపతి విజయ్?.. తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించడంతో త‌మిళ‌నాడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని పార్టీలు ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశాయి. అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో డీఎంకే ముందుకు సాగుతుండగా, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి అధికారం కైవసం చేసుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజ‌య్‌ ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు నామ్ తమిళర్ కట్చి కూడా ప్రతి ఎన్నికలో తన ఓటు శాతాన్ని పెంచుకుంటూ వస్తోంది.

Details

డీఎంకే కూటమికి 114 స్థానాలు వచ్చే అవకాశం

ఇలాంటి పరిస్థితుల్లో వెలువడిన తాజా సర్వే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ సర్వే ప్రకారం డీఎంకే కూటమికి 104 నుంచి 114 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉండగా, మెజారిటీకి అవసరమైన 118 సీట్లను అందుకోవడం కష్టమవుతుందని అంచనా. అదే సమయంలో అన్నాడీఎంకేకు సుమారు 127 స్థానాలు దక్కే అవకాశముందని వెల్లడైంది. మరోవైపు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు సుమారు 15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, నామ్ తమిళర్ కట్చి 8 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. అయితే పలు ఇతర సర్వేలు మాత్రం డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని సూచించడం గమనార్హం.

Details

కీలక మలుపు ఇదే

ఈ ఎన్నికల్లో ప్రధాన మలుపుగా మారే అంశం ఓట్ల చీలిక. డీఎంకేపై అసంతృప్తితో ఉన్న ఓటర్లు సాధారణంగా అన్నాడీఎంకేకు వెళ్లాల్సి ఉండగా, ఈసారి ఆ ఓట్లు విజయ్ పార్టీ వైపు మళ్లే అవకాశముందని సర్వే తెలిపింది. దీని వల్ల అనేక నియోజకవర్గాల్లో డీఎంకే స్వల్ప తేడాతో ఓటమి చవిచూడే పరిస్థితులు ఉండొచ్చని అంచనా. ఈ పరిణామాలతో ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే నేత ఎంకే.స్టాలిన్‌, అలాగే ఎడప్పాడి పళనిసామిలలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది కూడా విజయ్‌కు వచ్చే ఓట్లపై ఆధారపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Details

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు

తాజా సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ వ్యక్తిగతంగా కొన్ని వివాదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయ్-త్రిష వ్యవహారం, కరూర్ తొక్కిసలాట కేసు వంటి అంశాలు ఆయనపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు చెబుతున్నంత ప్రభావాన్ని విజయ్ నిజంగా చూపగలరా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Details

ఓట్లు చీల్చనున్న టీవీకే

ఈ ఎన్నికల్లో టీవీకే సుమారు 15 శాతం ఓట్లు సాధించి అధికార నిర్ణయంలో కీలక పాత్ర పోషించే అవకాశముందని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకేకు మద్దతుగా ఉన్న ఓటర్లలో కొంతమంది టీవీకే వైపు మళ్లే అవకాశముంది. యువ ఓటర్లు కూడా విజయ్‌కు మద్దతు ఇచ్చే అవకాశముందని అంచనా. డీఎంకే బలంగా ఉన్న ప్రాంతాల్లో టీవీకే ఓట్ల చీలిక వల్ల అధికార పార్టీకి పెద్ద నష్టం కలగవచ్చని సర్వే సూచిస్తోంది. అదే సమయంలో అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేత కె. ఎ.సెంగోట్టయ్యన్ వంటి వారు టీవీకేలో చేరడం కూడా ఆ పార్టీకి బలం చేకూర్చే అంశంగా మారింది. ఈఎన్నికల్లో విజయ్ పాత్రే తుది ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారబోతోందని స్పష్టమవుతోంది.

Advertisement