Loading...
Mailardevpally Fire Accident: మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

Mailardevpally Fire Accident: మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాముకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ గోదాము పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పక్కనున్న గోదాములకు మంటలను వ్యాపించినట్లు సమాచారం.

ADVERTISEMENT