Indonesia Helicopter Crash: కార్చిచ్చు ఆర్పేందుకు వెళ్లి.. నదిలో కూలిన హెలికాప్టర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 08, 2026
08:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో కార్చిచ్చును అదుపు చేసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. దక్షిణ కాలిమంటన్ ప్రావిన్స్‌లోని బరిటో క్వాలా రీజెన్సీ పరిధిలో కార్చిచ్చు చెలరేగడంతో మంటలను అదుపు చేసేందుకు అధికారులు EC225LP (VH-HGM) హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. నీటిని సేకరిస్తుండగా అదుపుతప్పి.. మంటలను ఆర్పే చర్యల్లో భాగంగా నదిలో నుంచి నీటిని సేకరించేందుకు హెలికాప్టర్ ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి నదిలో కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ నదిలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు సిబ్బందిని స్థానికులు రక్షించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.