తదుపరి వార్తా కథనం

INDw Vs SLw: మహిళల వన్డే సిరీస్‌లో శ్రీలంకపై భారత్ భారీ విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 27, 2025
05:32 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకపై టీమిండియా సులభంగా విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్ నష్టపోయి, 29.4 ఓవర్లలో ఛేదించింది.
స్మృతి మంధాన 43 పరుగులు చేసి ఔట్ కాగా, ప్రతీక రావల్ (50*) హర్లీన్ డియోల్ (48*) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు.
శ్రీలంక బౌలర్లలో ఇనోక రణవీర ఒక వికెట్ తీశారు. వర్షం కారణంగా, 50 ఓవర్ల మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.