Srilanka: శ్రీలంకలో తీవ్రమవుతున్నఆరోగ్య సంక్షోభం.. ఆసుపత్రులకు తాళం
శ్రీలంక రాజధాని కొలంబోకు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాధపుర టీచింగ్ హాస్పిటల్‌లోని పిల్లల వార్డును వైద్యుల కొరత కారణంగా మూసివేయాల్సి వచ్చింది. కొలంబోకు ఆనుకుని ఉన్న మరో ఆసుపత్రిలో,అనస్థీషియా విభాగంలో వైద్యుల కొరత కారణంగా అన్ని ఆపరేషన్లు ఎమర్జెన్సీకి వాయిదా పడ్డాయి. అల్ జజీరా నివేదికలో,శ్రీలంక ఆరోగ్య మంత్రి రమేష్ పతిరానా దేశవ్యాప్తంగా 100కి పైగా ఆసుపత్రులు మూసివేత అంచున ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీలంకను విడిచిపెట్టి విదేశాలకు వెళ్తున్న వైద్యులు తమకు దేశంలో డబ్బు,గౌరవం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. పైగా,అధిక ద్రవ్యోల్బణం కారణంగా వారు క్లిష్ట పరిస్థితుల్లో జీవించవలసి ఉంటుంది.ఈ పరిస్థితుల్లో వైద్యులు ఇప్పుడు తమ భవిష్యత్తు,పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. అందుకే వారు దేశం విడిచి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు.
వైద్యులు ప్రత్యేక ఇంధన కోటా కోసం అభ్యర్థించినప్పుడు, ప్రజా వ్యతిరేకత
కోవిడ్ మహమ్మారి తర్వాత, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆహారం, మందులు, ఇంధనం అనేక ఇతర నిత్యావసర వస్తువుల కోసం అక్కడి ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వైద్యులు దీనికి మినహాయింపు కాదు,కానీ వైద్యులు ప్రత్యేక ఇంధన కోటా కోసం అభ్యర్థించినప్పుడు, ప్రజా వ్యతిరేకత వచ్చింది. నేటికీ, శ్రీలంక వైద్యులు అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, మందుల కొరత, ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.