
SRI LANKA: శ్రీలంకలో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ సేవలు ప్రారంభం..!
ఈ వార్తాకథనం ఏంటి
శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని శ్రీలంకలో స్టార్‌లింక్ ప్రారంభించింది. దీనిపై అధికారిక ప్రకటన నేడు ఎక్స్ (మునుపటి ట్విట్టర్) వేదికగా విడుదలైంది. ఇప్పటికే జూన్ మొదటి వారంలోనే శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఈ సేవలకు అనుమతి ఇచ్చినట్టు వెల్లడించింది. ప్రజల అభిప్రాయాలను రెండు వారాల పాటు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని సంస్థ తెలిపింది. ఇటివేళ దేశంలో ఉన్న ఇంటర్నెట్ సమస్యలను ఈ కొత్త సేవలొచ్చి పరిష్కరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మరోవైపు, భద్రతాపరంగా చూస్తే అసాంఘిక కార్యకలాపాలను గమనించడం లేదా ట్రాక్ చేయడం కష్టంగా మారే అవకాశముందని పేర్కొంది.
వివరాలు
భారత్‌లో కూడా స్టార్ లింక్‌కు గ్రీన్‌సిగ్నల్
శ్రీలంకలో ఈ సేవలను వినియోగించాలంటే వినియోగదారులు ముందుగా ఒకసారి చెల్లించాల్సిన హార్డ్‌వేర్ ఖర్చు రూ.1,18,000 శ్రీలంక రూపాయలు కాగా, నెలవారీగా అన్‌లిమిటెడ్ డేటా కోసం రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలు సండే టైమ్స్ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇక భారత్‌లో కూడా స్టార్ లింక్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. టెలికాం శాఖ అవసరమైన లైసెన్స్‌ను జారీ చేయడంతో కంపెనీ దేశంలో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సేవలకు అనుమతి పొందిన మూడో సంస్థగా స్టార్‌లింక్ నిలిచింది. అంతకు ముందు యులెల్సాట్ వన్‌వెబ్, రిలయన్స్ జియో సంస్థలు ఈ అనుమతులు పొందాయి.
వివరాలు
100కు పైగా దేశాల్లో స్టార్‌లింక్ సేవలు
స్టార్‌లింక్ ట్రడిషనల్ జియోస్టేషనరీ శాటిలైట్‌లపై ఆధారపడకుండా, భూమికి దగ్గరగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (లియో) శాటిలైట్‌లను ఉపయోగించి సేవలను అందిస్తోంది. ఈ శాటిలైట్‌లు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్యలో చుట్టేస్తుండటంతో, తక్కువ లేటెన్సీతో వేగవంతమైన ఇంటర్నెట్‌ను వినియోగదారులు పొందగలుగుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాల్లోనూ ఈ సాంకేతికత ప్రయోజనకరంగా మారుతోంది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టార్‌లింక్ చేసిన ట్వీట్
Starlink's high-speed, low-latency internet is now available in Sri Lanka! 🛰️🇱🇰❤️ → https://t.co/Gn2UWiRRqn pic.twitter.com/MeNFa3wNPz
— Starlink (@Starlink) July 2, 2025