Page Loader
IND vs SL : ఇవాళ ఇండియా, శ్రీలంక టీ20 మ్యాచ్.. పిచ్ గురించి తెలుసుకోండి

IND vs SL : ఇవాళ ఇండియా, శ్రీలంక టీ20 మ్యాచ్.. పిచ్ గురించి తెలుసుకోండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2024
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నెగ్గిన భారత పురుషుల జట్టు ఇవాళ టీ20 సిరీస్‌తో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచులు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ఇరు జట్లూ తమ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శ్రీలంక జట్టుకు చరిత్ అసలంక బాధ్యతలు చేపట్టనున్నారు. పల్లెకెలె పిచ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Details

పల్లెకెలె మైదానం బౌలర్లకు అనుకూలం

పల్లెకెలె స్టేడియంలోని పిచ్ బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కసారి బ్యాటర్ ఈ పిచ్‌పై నిలబడితే భారీ షాట్‌లను ఆడగలడు. పిచ్ స్లో అయ్యే కొద్ది స్నిన్నర్లకు అనుకూలంగా మారనుంది. ఈ పిచ్‌పై 170 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించారు. పల్లెకెలెలో ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుండి కనిష్టంగా 22 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 35 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.

Details

అత్యధిక స్కోరు చేసిన గ్లెన్ మాక్స్ వెల్

పల్లెకెలె మైదానంలో 23 టీ-20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 12సార్లు ఛేజింగ్ జట్లు గెలుపొందాయి. ఈ మైదానంపై 2016 సంవత్సరంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేసిన 263/3 పరుగుల భారీ స్కోరు చేసింది. పల్లెకెలెలో న్యూజిలాండ్ అత్యల్ప జట్టు స్కోరు (88/10) ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉంది . ఈ స్టార్ ఆటగాడు 2016లో శ్రీలంకపై 65 బంతులు ఎదుర్కొని 145 పరుగులు చేశాడు. అతనితో పాటు బ్రెండన్ మెకల్లమ్, తిలకరత్నే దిల్షాన్ కూడా ఈ గడ్డపై సెంచరీలు సాధించారు.

Details

రెండుసార్లు 5 వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ

ఈ మైదానంలో అజంతా మెండిస్ (6/16) వికెట్లు తీశాడు. ఇక లసిత్ మలింగ రెండుసార్లు 5 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌ అతనే. ఈ మైదానంలో శ్రీలంక ఆడిన 17 టీ20 మ్యాచుల్లో 10 విజయాలను నమోదు చేసింది. ఈ మైదానంలో శ్రీలంక జట్టు 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరోవైపు పల్లెకెలెలో జరిగిన ఏకైక టీ20లో టీమిండియా 39 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన విషయం తెలిసిందే.