Page Loader
Oman coast : ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా..మృతుల్లో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది
Oman coast : ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా..మృతుల్లో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది

Oman coast : ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా..మృతుల్లో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2024
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న 'ప్రెస్టీజ్ ఫాల్కన్' చమురు నౌక ఒకటి ఒమన్ తీరంలో బోల్తాపడింది. దీంతో నౌకలోని 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. నౌక మునిగిపోతున్నట్టు సముద్ర భద్రతా కేంద్రం వెల్లడించిన ఒక రోజు తర్వాత అది పూర్తిగా మునిగిపోయింది. అయితే, నౌక బోల్తా పడడం వల్ల చమురు కానీ, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు కానీ సముద్రంలో లీకవుతున్నదీ, లేనిదీ వెల్లడించలేదు. నౌక యెమెనీ ఓడరేవు అడెన్‌కు వెళ్తుండగా ఒమన్ ప్రధాన పారిశ్రామిక పోర్టు అయిన దుక్మ‌లో బోల్తాపడింది. 117 మీటర్ల పొడవైన ఈ ‌చమురు నౌకను 2007లో నిర్మించారు

వివరాలు 

 నైరుతి తీరంలో దుక్మ్ పోర్ట్ ఒమన్

ఇలాంటి చిన్నచిన్న నౌకలను తీరప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తారు. నౌకలోని వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నైరుతి తీరంలో దుక్మ్ పోర్ట్ ఒమన్ దుక్మ్ పోర్ట్ ఒమన్ నైరుతి తీరంలో ఉంది. ఇది దేశంలోని ప్రధాన చమురు గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం దుక్మ్ విస్తారమైన పారిశ్రామిక జోన్‌లో భాగంగా ఉంది. ఇది ఒమన్ కి అతిపెద్ద ఏకైక ఆర్థిక ప్రాజెక్ట్ .