LOADING...
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం
ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో నటుల వివాహాల హల్చల్ కొనసాగుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తమ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేరబోతున్నారు. సాయి శ్రీనివాస్‌ నిశ్చితార్థం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. సాయి శ్రీనివాస్‌ కాబోయే భార్య పేరు కావ్య, హైదరాబాద్‌కు ఆమెకు సినీ రంగంతో సంబంధం లేదు.

Details

కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం

కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. సాయి సాయి శ్రీనివాస్‌ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు. టాలీవుడ్‌లో 'అల్లుడు శీను' సినిమా ద్వారా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన, 'జయ జానకి నాయక', 'రాక్షసుడు', 'కిష్కింధపురి' వంటి యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం 'హైందవ', 'టైసన్ నాయుడు' సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisement