
Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలే భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు.
ఇప్పుడు అదే దారిలో మరో ప్రముఖ క్రికెటర్ కూడా తన టెస్ట్ ప్రయాణానికి పుల్ స్టాప్ పెట్టి, ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఆయనెవరో కాదు... శ్రీలంక జట్టు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్.
ఆయన అధికారికంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. జూన్ 17న గాలె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్ మాథ్యూస్‌కు చివరి టెస్ట్ మ్యాచ్ కానుంది.
ఇప్పటికే వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన... తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకోవడంతో ఇకపై తాను కేవలం టీ20 క్రికెట్ మాత్రమే ఆడనున్నట్లు స్పష్టమైంది.
వివరాలు
17 సంవత్సరాల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు సమాప్తం..
మాథ్యూస్ తన టీ20 అరంగేట్రాన్ని 2009లో ఆస్ట్రేలియాతో చేశాడు.
ఇక తన చివరి టీ20 మ్యాచ్‌ను 2024లో నెదర్లాండ్స్‌తో ఆడాడు. టెస్టుల నుంచి తప్పుకుంటున్న విషయాన్ని ప్రకటించిన సందర్భంగా మాథ్యూస్ భావోద్వేగానికి గురయ్యారు.
17 సంవత్సరాల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ఇక సమాప్తం పలికే సమయం వచ్చిందని తెలిపారు.
ఈ తరుణంలో తన ప్రయాణంలో పక్కన నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తనను నిరంతరం ప్రోత్సహించిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రకటనను ముగించారు.
వివరాలు
34 టెస్టులకు కెప్టెన్‌గా..
శ్రీలంక తరఫున మాథ్యూస్ మొత్తం 118 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 44 సగటుతో మొత్తం 8,167 పరుగులు చేశారు.
బౌలింగ్ విభాగంలోనూ తన మార్కు చూపించి 33 వికెట్లు పడగొట్టారు.
అంతేకాకుండా, 34 టెస్టులకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. టెస్ట్ అరంగేట్రాన్ని పాకిస్థాన్‌తో గాలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో చేశాడు.