South Africa: టెస్టు సిరీస్‌కి ముందు దక్షిణాఫ్రికాకు శుభవార్త.. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టుకు శుభవార్త అందింది.
కెప్టెన్ తెంబా బవుమా తిరిగి జట్టులోకి చేరాడు. గాయం కారణంగా బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరమైన బవుమా ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాడు.
దీంతో శ్రీలంకతో ఆడే రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా సెలెక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
స్టార్ పేసర్ లుంగి ఎంగిడి శ్రీలంక సిరీస్‌కు దూరమైనప్పటికీ పేస్ దళానికి సీనియర్ ఆటగాడు కగిసో రబడ నాయకత్వం వహిస్తారు.
బవుమా తిరిగి జట్టులో చేరడం, శ్రీలంక సిరీస్‌లో విజయం సాధిస్తే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి.
తెంబా బవుమా గాయం కారణంగా దూరం కావడంతో ఎడెన్ మార్క్‌రమ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.
Details
నవంబర్ 27న మొదటి టెస్టు
అతడి నాయకత్వంలో బంగ్లాదేశ్ పర్యటనలో 2-0తో సిరీస్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీంతో దక్షిణాఫ్రికాను టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
దక్షిణాఫ్రికా జట్టు ఇదే
తెంబా బవుమా(కెప్టెన్) , డేవిడ్ బెడింగమ్, టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, రియాన్ రికెల్టన్, కేల్ వెర్రిన్నే, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఏడెన్ మార్క్‌రమ్, వియాన్ మల్డర్, సెనురెన్ ముతుస్వామి, డేన్ పేటర్సన్, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ.
టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే
మొదటి టెస్టు: నవంబర్ 27 నుండి డర్బన్‌లో కింగ్స్‌మీడ్ మైదానంలో
రెండో టెస్టు: డిసెంబర్ 5 నుండి సెయింట్ జార్జెస్ పార్క్‌లో