రోడ్డు ప్రమాదం: వార్తలు
20 Mar 2023
ఉత్తరాఖండ్ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
25 Feb 2023
మధ్యప్రదేశ్సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొనడంతో 14 మంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రేవా-సత్నా సరిహద్దులోని మోహనియా సొరంగం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
24 Feb 2023
ఛత్తీస్గఢ్ఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో కనీసం 11మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
11 Feb 2023
నందమూరి బాలకృష్ణనందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్
నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
28 Jan 2023
దిల్లీదిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
27 Jan 2023
గుజరాత్గుజరాత్: దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, భర్తను 12కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
దిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలిని కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన తరహా ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
19 Jan 2023
మహారాష్ట్రముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
13 Jan 2023
మహారాష్ట్రనాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
09 Jan 2023
దిల్లీదిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా..
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో విచారణ జరుగుతున్నా కొద్ది.. షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో అరెస్టయిన నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కారు కింద ఆ యువతి ఇరుక్కుపోయిందని తమకు తెలుసునని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
06 Jan 2023
దిల్లీఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో పోలీసులు మరో పురోగతిని సాధించారు. అంజలిని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు యజమాని అశుతోష్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు కారులో ఉన్న నలుగురితో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
30 Dec 2022
భారతదేశం2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి
భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.