ఉత్తరాఖండ్: వార్తలు
22 Mar 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?
ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని దేవస్థాన్‌లో దీన్నిఏర్పాటు చేశారు.
20 Mar 2023
రోడ్డు ప్రమాదంఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
07 Mar 2023
భారతదేశంఉత్తరాఖండ్లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం
ఉత్తరాఖండ్‌లో గత కొన్ని నెలలుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో 107 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం కార్చిచ్చు వల్ల దగ్ధమైనట్లు రాష్ట్ర అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్హ్వాల్ ప్రాంతంలో 40.68 హెక్టార్లు, కుమావోన్ ప్రాంతంలో 35.55 హెక్టార్ల విస్తీర్ణం దగ్ధమైనట్లు తెలుస్తోంది.
03 Feb 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి.
24 Jan 2023
దిల్లీదిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
13 Jan 2023
జోషిమఠ్ISRO: జోషిమఠ్ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్‌లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
11 Jan 2023
భారతదేశంజోషిమఠ్ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
10 Jan 2023
భారతదేశండేంజర్ జోన్లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు
ప్రకృతి ప్రకోపానికి కుంచించుకుపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణంలో కూలిపోయే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రోజు రోజుకు పగుళ్లు వచ్చిన ఇళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది విపత్తుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
05 Jan 2023
సుప్రీంకోర్టు50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.