UCC: సహజీవనానికి రిజిస్ట్రేషన్ లేకుంటే 6నెలు జైలు శిక్ష.. యూసీసీ బిల్లులో నిబంధనలు ఇవే..
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లును మంగళవారం సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఉత్తరాఖండ్‌లోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా ఏకరీతి వివాహం, విడాకులు, భూమి, ఆస్తి,వారసత్వ చట్టాలను ప్రతిపాదిస్తుంది. ఎవరైనా సహజీవనం చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా రిజిస్టర్ లేకుంటే, ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని బిల్లులో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ నివాసి అయినా, కాకపోయినా రాష్ట్రంలో నివసిస్తూ.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటే, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఈ యూసీసీ బిల్లు చెబుతోంది. సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయంలో లివ్-ఇన్ రిలేషన్షిప్ వివరాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
యూసీసీలో పొందుపర్చిన అంశాలు ఇవే..
యూసీసీ అమలు తర్వాత బహుభార్యాత్వం నిషేధించబడుతుంది. బాలికల వివాహానికి చట్టబద్ధమైన వయస్సు 21 సంవత్సరాలు అవుతుంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే ఈ సమాచారాన్ని వారి తల్లితండ్రులకు కూడా అందించాల్సి ఉంటుంది. వివాహం నమోదు చేసుకోకపోతే.. ప్రభుత్వ పథకాలను కోల్పోతారు. ముస్లిం మహిళలకు కూడా దత్తత తీసుకునే హక్కు ఉంటుంది. దత్తత ప్రక్రియ సరళంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరికీ విడాకుల ప్రక్రియలో సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేసే కొడుకు చనిపోతే వృద్ధ తల్లిదండ్రులను పోషించే బాధ్యత భార్యపైనే ఉంటుంది. అలాగే ఆమెకు పరిహారం అందుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు, పిల్లల సంరక్షణను వారి తాతలకు అప్పగించే అవకాశం.