
Helicopter crash: ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కలకలం ఇంకా చల్లారకముందే, మరో విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్లుతున్న హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి కారణంగా వాతావరణం అనుకూలించకపోవడాన్ని భావిస్తున్నారు.
Details
గౌరీకుండ్ అడవిలో కూలిన విమానం
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి బయలుదేరి కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా మధ్యలోనే గౌరీకుండ్ అడవిలో కూలిపోయింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. తన ట్వీట్‌లో 'రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన విషయం తెలిసి చాలా కలచివేసింది. ఇది బాధాకరం. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులందరి సురక్షితత్వం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.