
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో యూసీసీ నిబంధన సవరణ.. ఆధార్ లేకపోయినా వివాహ నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించిన ఒక నిబంధనలో మార్పులు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ సవరణ ప్రకారం, ఇకముందు నేపాల్, భూటాన్, టిబెట్ పౌరులు ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలతో తమ వివాహాలను నమోదు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ఆ దేశాల పౌరులకు పెద్ద ఊరట లభించనుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్, భూటాన్, టిబెట్‌లతో సరిహద్దులు పంచుకుంటుంది. అక్కడి ప్రజలతో ఉత్తరాఖండ్ వాసుల మధ్య కుటుంబ, సామాజిక సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి.
వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం యూసీసీ నిబంధనల్లో సవరణ
అయితే యూసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత, ఆధార్ కార్డు లేకపోవడం వల్ల నేపాల్, భూటాన్, టిబెట్ పౌరులు తమ వివాహాలను నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూసీసీ నిబంధనల్లో సవరణ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఇకపై నేపాల్, భూటాన్, టిబెట్ పౌరులకు వివాహ నమోదు కోసం ఆధార్ అవసరం ఉండదు. చెల్లుబాటు అయ్యే ఇతర గుర్తింపు పత్రాలు లేదా వారి దేశ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.