Chamoli Train Accident: ఉత్తరాఖండ్‌లో రెండు లోకో రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చమోలీ జిల్లా విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్ధరాత్రి రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఒక లోకో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కార్మికులు,అధికారులు ప్రయాణిస్తున్నప్పటికీ, మరో లోకో రైలు నిర్మాణ సామగ్రిని తరలిస్తున్నది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది గాయడ్డారు.చమోలీ జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో కలిపి 109 మంది కార్మికులు,అధికారులు ఉన్నారు. వారిలో 60 మంది గాయపడ్డారని తెలిపారు. రైళ్లలో ఉండిపోయిన ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకోగలిగామని కూడా తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 10 మందిని గోపేశ్వర్ జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగింది.
వివరాలు
వచ్చే ఏడాదికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యం
మిగిలిన గాయపడ్డ వ్యక్తులకు ప్రాజెక్టు పరిధిలోనే ప్రాథమిక వైద్య సహాయం అందించారు. అదనంగా, ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని అధికారులు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని హెచ్చరించారు. చమోలీ జిల్లాలో హెలాంగ్-పిపల్కోటి మధ్య అలకనందా నదిపై నిర్మాణం జరుగుతున్న ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు నాలుగు టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అధికారుల ప్రకారం, ప్రాజెక్ట్ వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు.