UCC: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 'యూనిఫాం సివిల్ కోడ్' బిల్లు
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడుతోంది. యూసీసీ బిల్లును ఆమోదించేందుకే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా రెండో రోజు సమావేశమవుతోంది. యూసీసీ బిల్లుకు సభ ఆమోదం పొందితే దేశంలోనే యూసీసీని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ చట్టాన్ని తీసుకురావాలని తీర్మానం చేసింది. ఉదయం 11:00 గంటలకు యూసీసీ బిల్లును ముఖ్యమంత్రి ధామి ప్రవేశపెట్టనున్నారు. కొడుకు, కుమార్తెలకు సమాన ఆస్తి హక్కులు, దత్తత, బహుభార్యత్వం, బాల్య వివాహాలపై నిషేధం, అన్ని మతాల్లోని బాలికలకు సాధారణ వివాహ వయస్సు, విడాకుల కోసం ఒకే విధమైన కారణాలు, విధానాలను అమలు చేయడం వంటిని యూసీసీ బిల్లులో పొందుపర్చారు.