
Supreme court:క్షమాపణలు కాదు...చర్యలకు సిద్ధపడండి: బాబా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం కోర్టు సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
పతంజలి ఆయుర్వేద సంస్థ (Patanjali case) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్(Ram dev baba), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తప్పుడు వ్యాపార ప్రకటనలపై గతంలో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను చర్యలకు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వారి క్షమాపణలను అంగీకరించబోమని, చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ కేసులో తాము ఉదారంగా వ్యవహరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
పతంజలి ధిక్కరణ కేసులో బుధవారం విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లాలతో కూడిన ధర్మాసనం రామ్ దేవ్ బాబా వేసిన అఫిడవిట్ ను బుధవారం తిరస్కరించింది.
supreme court serious on Ramdev baba
మీ క్షమాపణల్ని అంగీకరించేదే లేదు: సుప్రీంకోర్టు
తప్పుడు ప్రకటనలపై గత నెలలో విచారణ సందర్భంగా రామ్ దేవ్ చెప్పిన క్షమాపణలతో తాము అంగీకరించలేమని జస్టిస్ హిమా కోహ్లి వ్యాఖ్యానించారు.
"మీరు కోర్టు పట్ల ఏవిధంగా అయితే అలక్ష్యంగా వ్యవహరించారో, అలానే మీ క్షమాపణ పట్ల మేమేందుకు అలా వ్యవహరించకూడదు? మీ క్షమాపణలపై మాకు అంతగా నమ్మకం లేదు.
మీ క్షమాపణలను మేం అంగీకరించడ లేదు. "అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.
తమకు క్షమాపణలు చెప్పడానికి ముందే తమ అఫిడవిట్లను మీడియాకు పంపారు.
మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు అవి మాకు అప్ లోడ్ కాలేదు.
దీన్ని బట్టి మీరు ప్రచారం కోరుకుంటున్నారని అర్థమవుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది.
Fmcg-Supreme court
ఆ ముగ్గురిని సస్పెండ్ చేయాలి: సుప్రీం ఆదేశాలు
తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజలను మోసగించడం సరికాదని, బాధ్యతతో కూడిన వ్యాపార దృక్పథాన్నిపతంజలి సంస్థ తప్పనిసరిగా కలిగి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
గతంలో కోర్టుకు మీరు చెప్పిన క్షమాపణలను కోర్టు అంగీకరించడం లేదని, మరింత నిజాయితీతో కూడిన వ్యాపార దృక్పథాన్ని కలిగి ఉండాలని తేల్చి చెప్పింది.
ఇది కేవలం ఎఫ్ఎంసీజీ కంపెనీకి సంబంధించి వ్యవహారం మాత్రమే కాదని , న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో సమాజానికి తెలియాల్సిన అవసరముందని పేర్కొంది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ ని సైతం సుప్రీం కోర్టు గట్టిగా మందలించింది.
లైసెన్సింగ్ అథారిటీలో ఉన్న ముగ్గురు సభ్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.