Page Loader
PM Modi: ఉత్తరాఖండ్, రుద్రపూర్ నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం 
ఉత్తరాఖండ్, రుద్రపూర్ నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

PM Modi: ఉత్తరాఖండ్, రుద్రపూర్ నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం 

వ్రాసిన వారు Stalin
Apr 02, 2024
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

నేడు ఉత్తరాఖండ్‌ నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్ నియోజకవర్గంలో భాగమైన రుద్రాపూర్‌లో జరిగే ర్యాలీతో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ లోక్‌సభ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ ర్యాలీకి లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలు కూడా ప్రధాని పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఏప్రిల్ 5న జరిగే మొదటి దశ ఓటింగ్‌లో ఓటు వేయనున్న ఉత్తరాఖండ్‌లో ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో బిజెపి వాటన్నింటినీ గెలుచుకుంది. ఈ సారి కూడా బీజేపీ ఎక్కువ ఆధిక్యంతో గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని ధామి అన్నారు.

Details 

ఉత్తరాఖండ్‌ పర్యటన అనంతరం రాజస్థాన్‌కు ప్రధాని 

లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరైన ధామి రోడ్‌షోలు చేస్తూ, బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఇక, ప్రధాన మంత్రి వచ్చే వేదిక దగ్గర ఎలాంటి హ్యాండ్‌బ్యాగ్‌లు, మండే పదార్థంతో పాటు ఇతర వస్తువులను నిషేధించాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఐజీ విజిలెన్స్ కేకే వీకే, డీఐజీ కుమాం రేంజ్ యోగేంద్ర రావత్, ఎస్‌ఎస్పీ మంజునాథ్ టీసీ, 46వ కార్ప్స్ పీఏసీ కమాండర్ పంకజ్ భట్, ఎస్పీ క్రైం చంద్రశేఖర్ ఘోడ్కేతో పాటు పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు ప్రధాని మోదీ భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లో తన కార్యక్రమాన్ని ముగించుకుని రాజస్థాన్‌కు బయలు దేరుతారు.