LOADING...
Uttarakhand: ఉత్తరకాశీలో క్లౌడ్‌బరస్ట్‌ కలకలం.. 9 మంది గల్లంతు!
ఉత్తరకాశీలో క్లౌడ్‌బరస్ట్‌ కలకలం.. 9 మంది గల్లంతు!

Uttarakhand: ఉత్తరకాశీలో క్లౌడ్‌బరస్ట్‌ కలకలం.. 9 మంది గల్లంతు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో తీవ్ర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్‌బర్స్ట్‌ (Cloudburst) సంభవించడంతో భారీ విపత్తు ఏర్పడింది. ఈ ఘటనలో బార్‌కోట్‌-యమునోత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్‌ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ హోటల్‌లో పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా, అకాల వర్షాల ప్రభావంతో నిర్మాణంలో ఉన్న హోటల్‌ ధ్వంసమైంది. ఘటన జరిగిన వెంటనే ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF), ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు స్పందించి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

Details

సహాయక చర్యలు ముమ్మరం

శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు యత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఘటనా ప్రాంతంలో ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నట్లు స్థానిక వాసులు పేర్కొన్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల మేరకు ఆదివారం సోమవారం రోజులలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంటూ రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ చేసింది. ప్రస్తుతం స్థానిక అధికారులు, అత్యవసర సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement