
Chopper Crashes: ఉత్తరాఖండ్'లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈఘటన గురువారం ఉదయం 9గంటల సమయంలో ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది.
గంగోత్రి వెళ్లేందుకు పర్యాటకులతో బయలుదేరిన హెలికాప్టర్ భగీరథి నదికి సమీపంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.
ప్రమాదం జరిగే సమయంలో ఆహెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో ఐదుగురు మరణించగా,ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు,రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
గాయపడిన వారిని అత్యవసరచికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటన్నది తెలియరాలేదు.ఘటనపై కేసు నమోదు చేసి,పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి
Five people died, and two others were injured after a private chopper, heading towards Gangotri, crashed in Uttarakhand’s Uttarkashi district around 9 AM.
— IndiaToday (@IndiaToday) May 8, 2025
Local residents and police reached the site soon after the crash. According to initial reports, around seven passengers were… pic.twitter.com/Sgt4BQ7TGF