Page Loader
Uttarakhand: అల్మోరాలో కాలువలో పడిన ప్రయాణికులతో నిండిన బస్సు.. 15 మందికి పైగా మృతి 
అల్మోరాలో కాలువలో పడిన ప్రయాణికులతో నిండిన బస్సు.. 15 మందికి పైగా మృతి

Uttarakhand: అల్మోరాలో కాలువలో పడిన ప్రయాణికులతో నిండిన బస్సు.. 15 మందికి పైగా మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్మోరాలో, ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం. బస్సు ఓవర్‌లోడ్‌ కారణంగా లోయలో పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదం తర్వాత దృశ్యం