Rahul Chahar: మూడున్నరేళ్లకే పెళ్లి బంధానికి ముగింపు పలికిన టీమిండియా క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహార్ నుంచి విడిపోతున్నట్లు ఫిబ్రవరి 20 (శుక్రవారం) ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా అధికారికంగా వెల్లడించారు. మార్చి 9, 2022న గోవాలో వీరిద్దరూ వివాహం చేసుకోగా, దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఈ జంట చట్టపరంగా విడాకులు తీసుకుంది. వివాహ సమయానికి రాహుల్ వయస్సు కేవలం 22 సంవత్సరాలే కావడం గమనార్హం. విడాకుల అనంతరం రాహుల్ తన భావోద్వేగాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నేను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. అప్పటికి నాకు నా విలువలు, నా గురించి పూర్తి అవగాహన లేదు. జీవితంలో నిజంగా ఏమి కావాలో కూడా స్పష్టత లేదు.
Details
ఈ తీర్పు వల్ల చాలా ఖర్చు అయ్యింది
ఆ తర్వాతి సంవత్సరాలు నాకు ఎన్నో అనూహ్య పాఠాలు నేర్పాయి. 15 నెలలుగా కోర్టుల చుట్టూ తిరిగాను. అక్కడ ఓర్పు, సహనం, సత్యం నుంచి వచ్చే బలం ఏమిటో నేర్చుకున్నాను. ఈ రోజు ఆ అధ్యాయం అధికారికంగా ముగిసింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తై విషయం సెటిల్ అయింది. అయితే ఈ తీర్పు నాకు చాలా ఖర్చు అయింది. అయినప్పటికీ కోపం, పశ్చాత్తాపం లేకుండా స్పష్టతతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. కొన్ని సంబంధాలు శాశ్వతం కావడానికి కాకుండా మనల్ని మేల్కొల్పడానికి, నేర్పడానికి, మార్చడానికి ఉంటాయి. ఇకపై స్వీయ గౌరవం, ధైర్యం, మెరుగైన నిర్ణయాలతో కొత్త ప్రారంభానికి సిద్ధమవుతున్నానని ఆయన పేర్కొన్నారు.