LOADING...
Trump: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు..  
ట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు..

Trump: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
09:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల అంశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు దేశాలపై ఆయన విధించిన సుంకాలు చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తన అధికార పరిమితులను మించి ఆయన ఈ టారిఫ్‌లు అమలు చేశారని కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్‌ తీసుకున్న సుంకాల నిర్ణయాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, ఏకపక్షంగా వాటిని అమలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. అత్యవసర అధికారాలను ఆధారంగా తీసుకుని అమెరికా వాణిజ్య భాగస్వామి దేశాలపై సుంకాలు విధించడం చట్టబద్ధం కాదని వెల్లడించింది. ఈ టారిఫ్‌ల వ్యవహారంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు ఇవ్వగా, ఆయనకు అనుకూలంగా ముగ్గురు న్యాయమూర్తులు మద్దతు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టారిఫ్‌లపై ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ

Advertisement