Page Loader
Uttarakhand Tunnel : అతి త్వరలో సొరంగం నుంచి బయటకు రానున్న కార్మికులు.. ముగింపు దశగా చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 23, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న సహాయక చర్యలు (రెస్క్యూ ఆపరేషన్‌) చివరి దశకు చేరుకుంది. గత 12 రోజులుగా టన్నెల్'లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ ముగింపు దశకు వచ్చేసింది. 41 మంది కార్మికులు మరో రెండు గంటల్లో బయటికి వచ్చే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. అర్ధరాత్రి నాటికి, 10 మీటర్ల శిథిలాలను, చిక్కుకున్న కార్మికుల నుంచి వారిని వేరు చేశాయని రెస్క్యూ బృందాలు వివరించాయి. మరికొన్ని గంటల్లో అందరినీ క్షేమంగా బయటకు తీసుకొస్తామని బృందంలోని సభ్యుడు, జోజిలా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌ హర్పాల్‌ సింగ్‌ (Harpal Singh) అన్నారు. ఈ క్రమంలనే శిథిలాల్లో చిక్కుకుపోయిన ఇనుప ముక్కలను తొలగించామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరి కొన్ని గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి : గిరీష్ సింగ్ రావత్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లోపలికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది : పీఎంఓ మాజీ సలహాదారులు