Akshay Kumar: సినిమా ట్రెండ్ మారింది.. 'ధురంధర్' హిట్ దానికి ఉదాహరణ: అక్షయ్ కుమార్
ఈ వార్తాకథనం ఏంటి
'ధురంధర్' సినిమా విడుదలైనప్పటి నుంచి సినీ ప్రపంచంలో ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా, అధిత్య థార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రికార్డులు సృష్టించింది. భారీ వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ 'ధురంధర్' తొలి భాగం గురించి మాట్లాడారు. ప్రేక్షకుల అభిరుచులు ఎలా మారుతున్నాయో ఈ సినిమా ఒక మంచి ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు మళ్లీ భారీ యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
Details
యాక్షన్ చిత్రాలకే ప్రేక్షకుల ఓటు
సినిమా ట్రెండ్స్‌పై మాట్లాడిన అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ధురంధర్ సినిమాను ఉదాహరణగా తీసుకుంటే ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం. సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. అయినప్పటికీ ప్రేక్షకులు దీనిని ఎంతో ఆదరించారు. రణ్‌వీర్ సింగ్ చేసిన హై ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలు, అలాగే ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిందని అన్నారు గతంలో సామాజిక సందేశాత్మక చిత్రాలకు ఉన్న ఆదరణను కూడా అక్షయ్ కుమార్ గుర్తుచేశారు. ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితం పరిస్థితి భిన్నంగా ఉండేది.
Details
అప్పటి పరిస్థితి వేరు
ఆ సమయంలో నేను టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ వంటి సామాజిక సందేశంతో కూడిన చిత్రాల్లో నటించాను. అప్పుడు అలాంటి కథలకు మంచి ఆదరణ లభించింది. సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఒకే ట్రెండ్ కొనసాగదు. ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు పరిస్థితులు మారిపోతుంటాయి. ప్రేక్షకుల అభిరుచులు, కథల ఎంపికలు కూడా కాలానికి అనుగుణంగా మారుతాయి. ఈరోజు ఇండియన్ ఫుడ్ తింటే, రేపు చైనీస్, మరుసటి రోజు ఇటాలియన్ తిన్నట్లే ప్రేక్షకుల టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. తర్వాత ప్రేక్షకులు ఏ రకమైన సినిమాలను ఇష్టపడతారో ముందుగానే చెప్పడం కష్టం" అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.