Page Loader
Tragedy: ఉత్తరాఖండ్‌లో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!
ఉత్తరాఖండ్‌లో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!

Tragedy: ఉత్తరాఖండ్‌లో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో మువానీ టౌన్ సమీపంలోని సుని బ్రిడ్జ్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 13 మంది ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి 150 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానికులు, పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బొలెరో వాహనం మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

Details

విచార వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిన వాహనం పూర్తిగా నాశనమైంది. మృతదేహాలను వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. PMNRF (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతులంతా స్థానికులేనని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.