
Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి భారీ వరదలు.. పలువురు గల్లంతు!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కుంభవృష్టి (Cloudburst) కురవడంతో భారీగా వరదలొచ్చాయి. దీంతో అనేక ఇళ్లు ముంపుకు గురయ్యాయి. వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద ఇరుక్కుపోయి దుర్మరణం చెందింది. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం.
Details
సహాయక చర్యలు ముమ్మరం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇళ్లలో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి స్పందించారు. స్థానిక అధికారులతో నిరంతరం మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.