యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించింది. బీజేపీ మెజారిటీ ఉన్న అసెంబ్లీలో ఒకరోజు ముందు ప్రవేశపెట్టిన బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీనిని ముందుగా సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు గతంలోనే సూచించాయి. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత, ఉత్తరాఖండ్ స్వాతంత్ర్యం తర్వాత మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, భూమి, ఆస్తి , వారసత్వంపై ఉమ్మడి చట్టాన్ని పొందిన మొదటి రాష్ట్రంగా అవతరిస్తుంది. UCC బిల్లు ప్రకారం, అన్ని వర్గాలలో స్త్రీలకు వివాహ వయస్సు 18,పురుషులకు 21 సంవత్సరాలు. నమోదు చేసుకోని వివాహాలు చెల్లనివిగా పరిగణించబడతాయి.