Page Loader
Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు
హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు

Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2024
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌ హల్ద్వానీలో బన్‌భూల్‌పురాలో హల్ద్వానీలోని మాలిక్ తోటలో అక్రమంగా ఆక్రమించిన మదర్సాలు, మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్న సందర్భంగా భారీగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. బన్‌భూల్‌పురాలో అక్రమంగా నిర్మించినమదర్సా, ప్రక్కనే ఉన్న మసీదు కూల్చివేతపై అక్కడి నివాసితులు వాహనాలు, పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టడం, రాళ్లు రువ్వడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, ఆసుపత్రిలో చేరిన వారిలో ఎక్కువ మంది పోలీసు సిబ్బంది. మిగిలిన వారు స్థానిక మదర్సా,దాని కాంప్లెక్స్‌లోని మసీదు కూల్చివేతలో పాల్గొన్న మున్సిపల్ కార్మికులు. ఈ కాల్పుల్లో బన్‌భూల్‌పురా ప్రాంతానికి చెందిన నలుగురు చనిపోయారు.

Details 

నిలిచిన ఇంటర్నెట్ సేవలు

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో గురువారం జరిగిన హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించారని AP అన్షుమాన్,రాష్ట్ర ADG లా అండ్ ఆర్డర్ వార్తా సంస్థ ANIకి ధృవీకరించారు.250మందికి పైగా పోలీసులు గాయపడ్డారని,వారిని ఆసుపత్రులకు తరలించారని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ధృవీకరించింది.రాత్రి 9గంటల తర్వాత నగరంలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.నైనిటాల్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని కూడా పరిపాలన ఆదేశించింది.హింస పెరగడంతో హల్ద్వానీలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హల్ద్వానీలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి,డీజీపీ అభినవ్ కుమార్‌తో సహా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని,"అరాచక అంశాల" పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను కోరారు.