LOADING...
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు.. రెండు గ్రామాల్లోని 60 మందికిపైగా గల్లంతు
రెండు గ్రామాల్లోని 60 మందికిపైగా గల్లంతు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు.. రెండు గ్రామాల్లోని 60 మందికిపైగా గల్లంతు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను ప్రకృతి మంగళవారం తీవ్రంగా కుదిపింది. ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన క్లౌడ్‌బర్స్ట్ కారణంగా ఒక్కసారిగా ఎగిసిపడిన వరదలు గ్రామాలను ముంచెత్తాయి. ఈ విపత్కర ఘటనలో ఇప్పటివరకు 50 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. కుండపోత వర్షాల ధాటికి ఖీర్ గంగా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి, పరిసర గ్రామాలైన ఖీర్‌బద్, థరాలి పూర్తిగా నీట మునిగాయి. కొండల నుండి దూసుకొచ్చిన ప్రవాహం పలు ఇళ్లు నేలమట్టం చేయగా, అనేక నివాసాలు తుఫాన్ ధ్వంసానికి లోనయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ మెరుపు వరదల తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో స్థానికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది.

వివరాలు 

సీఎం ధామి స్పందన - యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు 

ఇప్పటివరకు నలుగురి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. వారు శ్రమించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇటీవలి కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాల వల్ల అతలాకుతలమవుతున్నాయి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. "ఉత్తరకాశీలోని ధరాలి ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన నష్టం అత్యంత విచారకరం. ఎస్డీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్,జిల్లా యంత్రాంగం సహా అన్ని బృందాలు సహాయ,రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.సీనియర్ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తున్నాం.అక్కడి ప్రజల సంక్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను"అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు.

వివరాలు 

ముందు జాగ్రత్తలు - వాతావరణ శాఖ హెచ్చరికలు 

ఇక ఇటీవల ఉత్తరాఖండ్‌లో వరుసగా హెలికాప్టర్ ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, వరదల విధ్వంసం లాంటి విపత్తులు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. సీఎం ధామికి ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైతే మరిన్ని బలగాలను పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచే ఉత్తరాఖండ్‌లో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. హరిద్వార్‌ ప్రాంతంలో గంగా నది సహా అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సోమవారం రుద్రప్రయాగ్ జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడి, మట్టి రాళ్లు షాపులు మీద పడిన ఘటనలు నమోదయ్యాయి.

వివరాలు 

కొండ ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ 

ఆదివారం నాడు ఉద్ధమమ్ సింగ్ నగర్ జిల్లాలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో లేవ్డా, ఉపనదులు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. రాంపూర్-నైనిటాల్ ప్రధాన రహదారి, అలాగే చకర్పూర్, లఖన్‌పూర్, పిస్టోర్, బర్హైని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే, వర్షాలు ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం కొండ ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. అలాగే ఈ వారం మొత్తం 'ఎల్లో అలర్ట్' అమల్లో ఉంటుందని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ పోస్ట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ పోస్ట్