
Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన కలకలం రేపింది.
కైలాస్ మానసరోవర్ యాత్ర ప్రధాన మార్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వందలాది మంది యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడటంతో మార్గం పూర్తిగా మూసుకుపోయింది.
దీంతో యాత్ర మార్గం ఇరువైపులా స్థానికులు, యాత్రికులు నిలిచిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు స్పందించి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Details
నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు
రోడ్డుపై విరిగిపడిన భారీ బండరాళ్లను తొలగించేందుకు యంత్రాలతో ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే పర్వత ప్రాంతం కావడం వల్ల సహాయక చర్యలకు సాంకేతికంగా కొంత జాప్యం ఎదురవుతోంది.
ఇదిలా ఉండగా, విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు ముమ్మరం చేశాయి.
ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ, నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.