Uttarkashi tunnel: కూలిపోయిన ఉత్తరకాశీ సొరంగం లోపల చిక్కుకుపోయిన కార్మికుల మొదటి విజువల్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మొదటి విజువల్స్ మంగళవారం ఉదయం బయటపడ్డాయి. కూలిపోయిన సిల్క్యారా సొరంగం శిథిలాల ద్వారా రక్షకులు ఆరు అంగుళాల వెడల్పు గల పైప్‌లైన్‌ను లోపలికి నెట్టిన ఒక రోజు తర్వాత విజువల్స్ వచ్చాయి. ఇది వారికి పెద్ద మొత్తంలో ఆహారాన్ని సరఫరా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీని ద్వారా తొమ్మిది రోజుల పాటు లోపల చిక్కుకున్న 41 మంది కార్మికుల ప్రత్యక్ష విజువల్స్ కనిపిస్తాయి. ఇప్పటివరకు, ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన భాగం వెలుపల సొరంగంతో ఆక్సిజన్, డ్రై ఫ్రూట్ ,మందులు వంటి వస్తువులను సరఫరా చేయడానికి నాలుగు అంగుళాల ట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు.