Page Loader
IT raids on vivek venkatswamy: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటి రైడ్స్ 

IT raids on vivek venkatswamy: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటి రైడ్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2023
08:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐటి అధికారులు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేక్ వెంకటేస్వామి ఇంట్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు చెన్నూరులోని ఆయన స్వగృహంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగిందని సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రూ.8కోట్ల నగదును ఫ్రీజ్ చేసి పోలీసులు ఫ్రీజ్ చెయ్యడమే కాకుండా ఈసీ, ఐటీ,ఈడీ అధికారుల పోలీసులు సమాచారం అందించారు. పోలీసులిచ్చిన సమాచారం ఆధారంగా వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా ఇటీవలే వివేక్ బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటి రైడ్స్