Toll Collection: శాటిలైట్ ద్వారా టోల్ రుసుము వసూలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి ప్లాజా వద్ద ట్రయల్ రన్
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైని టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర మేర వాహనాలు బారులు తీరుతాయి. ఫాస్టాగ్ విధానం అమలులోకి రావడంతో వాహనదారులకు కొంత మేర ఇబ్బందులు తగ్గాయి. అయితే, ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్ళే విధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాట్లు చేసుకుంటోంది. టోల్ రుసుమును శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు చేయడానికి ట్రయల్ రన్‌ను యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం నిర్వహించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూత్‌లు ఉన్నాయి. విజయవాడ మార్గంలో ఉన్న ఎనిమిది బూత్‌లను తెరిచి, ఒక్కో బూత్‌లో సుమారు అరగంట పాటు ట్రయల్ రన్ చేశారు.
వివరాలు
విజయవాడ మార్గంలో మరో రెండు బూత్‌లను కూడా తెరిచే ప్రణాళిక
ఈ ట్రయల్‌లో వాహనాల నంబరులు కెమెరా గుర్తించిందా.. సెన్సర్ ద్వారా టోల్ రుసుము వసూలైందా లేదా, ఏవైనా వాహనాలు టోల్ చెల్లించకుండా వెళ్లిపోయాయో పరిశీలించారు. అప్పుడప్పుడూ కొన్ని వాహనాల నుంచి టోల్ రుసుము సరిగ్గా వసూలు కాకపోవడం గమనించారు. ఇలాంటి లోపాలను సరిదిద్దేందుకు ఎన్‌హెచ్‌ఏఐ, టోల్ ప్లాజా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రద్దీ ఎక్కువ ఉంటే, విజయవాడ మార్గంలో మరో రెండు బూత్‌లను కూడా తెరిచే ప్రణాళిక ఉంది. ఈ బూత్‌లలో హ్యాండ్ గన్ (చేతి యంత్రం) ద్వారా ఫాస్టాగ్‌లను స్కాన్ చేసి టోల్ రుసుము వసూలు చేస్తారు. ఈ ప్రక్రియను కూడా ట్రయల్‌లో భాగంగా పరిశీలించారు.
వివరాలు
ఫాస్టాగ్ సెన్సర్ ద్వారా మూడు సెకన్లలోనే స్కాన్
హైదరాబాద్-విజయవాడ హైవేపై ఈ విధానం ప్రస్తుతానికి పంతంగి టోల్ ప్లాజా వద్దే అమలు కానుంది. వాహనం ఫాస్టాగ్ సెన్సర్ ద్వారా మూడు సెకన్లలోనే స్కాన్ అవుతుంది. ఎలాంటి ఆటంకం లేకపోతే, ఒక్కో బూత్ నుంచి నిమిషానికి సుమారు 20 వాహనాలు సౌకర్యంగా వెళ్ళగలవు.