Page Loader
Uttarakhand: ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Uttarakhand: ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వ్రాసిన వారు Stalin
Mar 13, 2024
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుకు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసారు. దీంతో యూసీసీ బిల్లు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో చట్టంగా మారింది. యూసీసీ బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీ గత నెలలో ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఉత్తరాఖండ్ UCC చట్టం ప్రకారం.. కొడుకు, కుమార్తె ఇద్దరికీ ఆస్తిలో సమాన హక్కులు ఇవ్వబడుతాయి. ఈ చట్టం బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. అంతేకాకుండా, హలాల్, ఇద్దత్ వంటి ఇస్లామిక్ పద్ధతులను కూడా ఈ చట్టం నిషేధిస్తుంది. లివ్-ఇన్ రిలేషన్షిప్స్‌ కోసం రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరిగా చేసువాల్సి ఉంంటుంది. ఒకవేళ, రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే, జైలు శిక్ష పడుతుంది.

యూసీసీ

యూసీసీని వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు 

ఉత్తరాఖండ్ తర్వాత, అసోం సహా అనేక ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బిల్లుకు సంబంధించి ఇతర రాష్ట్రాలు కూడా తనను సంప్రదించాయని ఉత్తరాఖండ్ సీఎం ధామి చెప్పారు. అసోంతో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు దీన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూసిపిన్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మేనిఫెస్టోలో యూసీసీ కీలక హామీగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు సమయంలోనూ ఉత్తరాఖండ్‌లో యూసీసీ హామీతోనే బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది.