Uttarakhand YouTuber: జైన సాధువులతో అనుచితంగా ప్రవర్తించాడని యూట్యూబర్‌పై కేసు నమోదు
ఉత్తరాఖండ్‌లో ఇద్దరు జైన సన్యాసులు అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగిన వీడియోను వైరల్ చేసిన యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరిగింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా స్పందించారు.సీఎం ధామి ఆదేశాల మేరకు యూట్యూబర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యూట్యూబర్ సూరజ్ సింగ్ ఇటీవల తోటవ్యాలీ సమీపంలోని NH-07 రిషికేశ్ రహదారిపై రోడ్డుపై దిగంబర్ జైన శాఖకు చెందిన ఇద్దరు సాధువులను ఆపారు. దీని తర్వాత సూరజ్ సింగ్ దుస్తులు ధరించకపోవడంపై వ్యాఖ్యానించారు.అంతే కాదు సూరజ్ సింగ్ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీని తరువాత,జైన మతాన్ని అనుసరించే ప్రజలు ఆగ్రహం చెందారు.అతడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
యూట్యూబర్ సూరజ్ సింగ్ పై కేసు
దిగంబర జైన సన్యాసులను వేధించినందుకు యూట్యూబర్ సూరజ్ సింగ్ పై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేసి తెహ్రీకి బదిలీ చేయాల్సిందిగా ఎస్‌టీఎఫ్‌ని కోరినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అభినవ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, యూట్యూబర్ తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పాడు. ఇక సూరజ్ సింగ్ పై ఐపీసీ 67-A(లైంగిక అసభ్యకరమైన చర్యను కలిగి ఉన్న విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం),153-A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం),295-A (ఏ వర్గానికి చెందిన వారి మతాన్ని అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యపూర్వక చర్యలు) లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు అయ్యింది.