Page Loader
Uttarakhand: ఉత్తరాఖండ్ లో నేటి నుంచి అమలు కానున్న యూనిఫాం సివిల్ కోడ్‌
ఉత్తరాఖండ్ లో నేటి నుంచి అమలు కానున్న యూనిఫాం సివిల్ కోడ్‌

Uttarakhand: ఉత్తరాఖండ్ లో నేటి నుంచి అమలు కానున్న యూనిఫాం సివిల్ కోడ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలులోకి రానుంది. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుందని పేర్కొన్నారు. యూసీసీ అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం ధామి ఓ ప్రకటన విడుదల చేశారు: "యూసీసీ అమలుతో సమాజంలో వివిధ అంశాల్లో ఏకరూపత ఏర్పడుతుంది. పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు కల్పించడమే మా లక్ష్యం" అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వివరాలు 

యూసీసీలోని ముఖ్యాంశాలు: 

లింగ సమానత్వం: వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో సమానత్వం తీసుకురావడమే లక్ష్యం. మతాలతో సంబంధం లేకుండా: రాష్ట్రంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి యూసీసీ కీలక పాత్ర పోషిస్తుంది. సహ జీవన సంబంధాల క్రమబద్ధీకరణ: సహ జీవనంలో ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యం: సైనికులు, వాయుసేన, నౌకాదళంలో ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో వీలునామాను త్వరగా రూపొందించుకునే సదుపాయాన్ని కల్పించారు. వివాహ వయస్సు: అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా నిర్ణయించారు.

వివరాలు 

ముసాయిదా బిల్లు నుంచి రాష్ట్రపతి ఆమోదం దాకా: 

బహుభార్యత్వం నిషేధం: అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానం: హలాల్ విధానంపై నిషేధం విధించారు. ఉత్తరాఖండ్ సర్కారు యూసీసీ రూపకల్పనకు పెద్ద కసరత్తు చేసింది. 2022 మే 27న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 18 నెలల కసరత్తు తర్వాత సమగ్రమైన యూసీసీ ముసాయిదాను రూపొందించింది. 2024 ఫిబ్రవరి 2న ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. 2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుకు, నెలరోజుల తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. 2024 చివరిలో యూసీసీ అమలుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ సీఎస్ శత్రుఘ్న సింగ్ నేతృత్వంలో మరో కమిటీని నియమించారు.

వివరాలు 

కాంగ్రెస్ అభిప్రాయం: 

కాంగ్రెస్ పార్టీ, ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్న యూసీసీని ఏకాభిప్రాయం లేకుండా చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టుగా అభివర్ణించింది. "యూసీసీ అంటే అది రాష్ట్ర పరిమితి కాకుండా దేశ వ్యాప్తంగా ఏకరూపంగా ఉండాలి," అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు.