
Patanjali-supreme court: ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి సుప్రీంకోర్టు మందలింపు
ఈ వార్తాకథనం ఏంటి
పతంజలి (Patanjali)తప్పుడు ప్రకటనల కేసులు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ .తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పతంజలి పై చర్యలు తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది .
ప్రజలను తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధారణమైన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు అనుబంధ ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ విషయాన్ని రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ మంగళవారం కోర్టుకు తెలియజేసింది.
ఈ నెల 10వ తారీఖున ఇచ్చిన తీర్పుతో ఉత్తరాఖండ్ అధికారులు నిద్ర నుంచి లేచినట్టు కనిపిస్తోందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Patanajali-supreme Court
ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదు: సుప్రీం కోర్టు
మీరు చేయాలనుకుంటే ఎంత వేగంగానైనా పనులు చేస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
9 నెలల నుంచి పతంజలి సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.
కాగా, మంగళవారం నాటి విచారణకు పతంజలి వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలకృష్ణ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు