LOADING...
Devbhoomi: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్-కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలలో.. హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం
హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం

Devbhoomi: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్-కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలలో.. హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేవభూమిగా ఖ్యాతి పొందిన ప్రసిద్ధ గంగోత్రి ధామ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం జరిగిన శ్రీ గంగోత్రి ఆలయ కమిటీ సమావేశంలో, గంగోత్రి ధామ్‌లో హిందూయేతరులకు ప్రవేశం కల్పించకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. కమిటీ సభ్యులంతా ఈ నిర్ణయానికి మద్దతు తెలపడంతో అది అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ ఆంక్షలు గంగోత్రి ధామ్‌కే కాకుండా, గంగామాత శీతాకాలంలో నివసించే ముఖబా ప్రాంతానికీ వర్తిస్తాయని కమిటీ చైర్మన్ సురేష్ సెమ్వాల్ వెల్లడించారు. ఆలయ పవిత్రత, శాస్త్రీయ సంప్రదాయాలు దెబ్బతినకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

ఇదే మార్గంలో బద్రీనాథ్-కేదార్‌నాథ్

గంగోత్రి ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఇతర ప్రముఖ ఆలయాలు కూడా ఇదే మార్గంలో అడుగులు వేయనున్న సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ, తమ పరిధిలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు అన్ని ఉపాలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించే ప్రతిపాదనను త్వరలో జరిగే బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ ఘాట్ వంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి నిబంధనలు అమలులో ఉండగా, ఇప్పుడు చార్ ధామ్ యాత్రకు చెందిన ప్రధాన ఆలయాలకూ ఈ ఆంక్షలు విస్తరించనున్నట్లు కావడం విశేషంగా మారింది.

Advertisement