Page Loader
Uttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం 
మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం

Uttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2023
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. రెస్క్యూ పనులకు అవాంతరాలు కలగడంతో అందులో చిక్కుకున్న 41 కార్మికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఈ ఘటన జరగ్గా, అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రిల్లింగ్ సమయంలో ఆగర్ యంత్రం విచ్ఛిన్నమైన విషయం తెలిసిందే. దీంతో ఒకేసారి రెండురకాల పనులను ఆదివారం మొదలుపెట్టారు. మొదట నిలువుగా డ్రిల్లింగ్ చేసి లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీయనున్నారు. ఇక రెండోవ ప్రణాళికలో బాగంగా మ్యానువల్ డ్రిల్లింగ్ చేయడం, ముక్కలైన భాగాలు పూర్తిగా బయటకి వచ్చేస్తే సిబ్బంది ద్వారా 10-12 మీటర్ల మేర తవ్వకాలు చేయాల్సి ఉంటుంది.

Details

 డ్రిల్లింగ్ పనిలో ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు సాయం

మరోవైపు ఆదివారం కొండపై నుంచి నిలువు డ్రిల్లింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకూ 19.2 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తయింది. కార్మికులను చేరుకోవాలంటే 86 నుంచి 87 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 30 నాటికి నిలువు డ్రిల్ పూర్తయ్యే అవకాశం ఉంది. ప్లాస్మా కట్టర్ తో ఆగర్ మిషన్ బ్లేడ్ లను కత్తిరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదే విధంగా మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం భారత సైన్యం రంగంలోకి దిగింది. మాన్యువల్ డ్రిల్లింగ్ పనిలో ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు సహాయం చేయనున్నారు. కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్ పగలు రాత్రి శ్రమిస్తున్నారని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (NHIDCL) ఎండీ మహమూద్‌ అహ్మద్‌ చెబుతున్నారు.