LOADING...
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు
బస్సు లోయలో పడి ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున అల్మోరా జిల్లా శిలాపానీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా,మరో 11మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాదం జరిగిన లోయప్రాంతం అతి క్లిష్టంగా ఉండడం,బస్సు కింద బురద పేరుకుపోవడంతో లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు తెలిపారు. స్థానికుల సహకారంతో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ద్వారహత్ నుంచి రాంనగర్‌కు వెళ్తున్న సమయంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అదుపు తప్పి లోయలో పడిన బస్సు 

Advertisement