
Nepal-Uttarakhand-Boarder Closed: ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో నేపాల్ -ఉత్తరాఖండ్ సరిహద్దుల మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఈనెల 19న ఉత్తరాఖండ్ లో ఎన్నికలు(Elections) జరగనున్న నేపథ్యంలో నేపాల్(Nepal) -ఉత్తరాఖండ్ (UttaraKhand)సరిహద్దును భద్రతా బలగాలు మూసివేశాయి.
ఎన్నికల కోడ్ (Election code) అమలు దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించేందుకు ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దును మూసివేస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం ఐదు స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉత్తరాఖండ్ -నేపాల్ సరిహద్దును మూసివేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ మూసివేత మంగళవారం సాయంత్రం ఐదు గంటలనుంచి 72 గంటలపాటు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల నిబంధనలో భాగంగా ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్ లో పోలింగ్ ముగిసిన వెంటనే యథావిధిగా ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దులు తెరుచుకుంటాయని వారు తెలిపారు.
Nepal-UtthaaKhand
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే...
మధ్యలో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇరుదేశాల మధ్య రాకపోకలు సాగించాలనుకుంటే అందుకు భద్రతా బలగాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుందని వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.